నీటి కేటాయింపులపై తెలంగాణ, కేంద్రం చెరోదారి... సుప్రీంలో భిన్న వాదనలు
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నది నీటి వివాదంలో ఈ ఉదయం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం పరస్పర భిన్న వాదనలు వినిపించాయి. నీటి పంపిణీ సమస్య రెండు రాష్ట్రాలది కాదని, నాలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించగా, సమస్యను జటిలం చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోందని కేంద్రం వాదించింది. కృష్ణా నీటి పునఃపంపిణీ ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయాలని కేంద్రం సూచించింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, కేంద్రం చెరోదారిన నడుస్తున్నట్టు స్పష్టం కాగా, తదుపరి జరిగే విచారణల్లో ఏపీ తన వాదనను వినిపించనుంది.